నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ కార్తీక్, మున్సిపల్ కమిషనర్ నందన్ తో పాటు జిల్లా పలువురు అధికారులు పాల్గొన్నారు. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, యోగాభ్యాసకులు సైతం ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై యోగాసనాలు వేశారు.