నెల్లూరు నగరంలో హనుమాన్ శోభాయాత్ర ఆదివారం విజయవంతంగా పూర్తయింది. నెల్లూరులోని ఏసీ స్టేడియం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కెవిఆర్ పెట్రోల్ బంకు, ఆర్టీసీ బస్టాండ్, వీఆర్సీ సెంటర్ మీదుగా స్టోన్ హౌస్ పేట వరకు సాగింది. పలు హిందూ సంఘాల నేతలు, కార్యకర్తలు కాషాయ రిబ్బన్లు ధరించి ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు నగరం జైశ్రీరామ్ నినాదాలతో నిండిపోయింది.