రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధికి చైర్మన్ హరి ప్రసాద్ సేవలు అభినందనీయమని జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయం కు వచ్చిన ఆయనను మల్లికార్జున యాదవ్ కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్త కళలను ప్రోత్సహించటం మనందరి బాధ్యత ఉందన్నారు. అందుకే దీనికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు.