నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు మధ్యలో డివైడర్ కోసం గుంటలు తవ్విన సంగతి తెలిసిందే. అల్పపీడన ప్రభావంతో ఒకవైపు జోరు వర్షం మరోవైపు పొదలకూరు రోడ్ లో వీధి దీపాల లైటింగ్ తక్కువగా ఉండటం వల్ల వాహనదారులు వాసన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ మాత్రం ఆదమరిచిన ఎదురుగా ఉన్న వాహనాలను తప్పించాలని పక్కకు వచ్చిన గుంటలలో పడిపోయే ప్రమాదముంది. ఈ మార్గంలో ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.