స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ శాఖల అభివృద్ధిని వివరిస్తూ శకటాలను రూపొందించారు. ప్రత్యేకంగా అటవీశాఖ, శ్రీ శిశు సంక్షేమ శాఖ, డ్వామా, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన శకటాలు శభాష్ అనిపించుకున్నాయి.