అస్థిత్వం చాటుకోవడానికే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు కపట నాటకాలాడుతున్నాడని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫైర్ అయ్యారు. కోవూరులో బుధవారం పాత్రికేయులు అడిగిన ఒక ప్రసన్నకు ఆమె సమాధానం చెబుతూ స్వంత పార్టీ నాయకులను నియంత్రించుకోలేక టిడిపి నేతలను ఆడిపోసుకుంటున్న ప్రసన్న తీరు అతని అసమర్ధతకు అద్దం పడుతుందన్నారు. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అంటూ సమాధానం చెప్పారు.