నెల్లూరు నగరంలోని వి ఆర్ సి గ్రౌండ్స్ లో హోరాహోరీగా జరుగుతున్న సమ్మర్ క్రికెట్ కప్ విజేతగా లక్కీ లెవెల్స్ జట్టు నిలిచింది. మంగళవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి హాజరై బహుమతులు అందించారు. యువతలో దాగి ఉన్న క్రెటా నైపుణ్యాన్ని వెలుగు తీసేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.