మనుబోలు మండలం కేంద్రంలో శ్రీ బ్రహ్మేశ్వర ఆలయంలో శ్రీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా శివపార్వతుల పారువేట కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. అర్చకులు సర్వేపల్లి ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు చేసి స్థానిక స్మశానంలో సాంప్రదాయ బద్ధంగా శివపార్వతుల పారువేట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.