నెల్లూరులోని వీఆర్ హైస్కూల్‌ను ఈనెల 7న ఉదయం 9 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ శుక్రవారం పాఠశాలను పరిశీలించారు. 1050 సీట్లు భర్తీ చేయగా, బోధన కోసం 45 మంది ఉపాధ్యాయులను నియమించామని చెప్పారు. జిల్లాలోని 54 పాఠశాలలను పీ-4లో భాగంగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.