నెల్లూరు గోమతి నగర్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మంత్రి నారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజనాయుడు ఆధ్వర్యంలో 68 కేజీల కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.