నారాయణ డైరెక్టర్ పునీత్ కోతప్పగా పేర్కొంటూ సైబర్ నేరస్తులు 1. 96 కోట్ల రూపాయలను కాజేశారు. ఈ నెల 7వ తేదీన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పునీత్ ఫోటోతో వాట్సప్ నంబరు 9866415037 నుంచి నారాయణ వైద్య కళాశాల, ఆసుపత్రి ఛార్టెడ్ అకౌంటెంట్ సురేష్ కుమార్ ను సంప్రదించారు. తాను మీటింగులో ఉన్నానని అర్జెంటుగా 1. 96కోట్లు పంపాలని పేర్కోవడంతో వెంటనే ఆ మొత్తాన్ని పంపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.