బారాషహీద్ దర్గా రొట్టెల పండగను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 1700 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. శనివారం ఐజీ త్రిపాఠి, ఎస్పీతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం లేకుండా, ఘాట్ వద్ద రొట్టెలు పట్టుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.