నెల్లూరు నగరంలో అతి పురాతనమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం రాత్రి ఆస్థాన మండపంలో ఊంజల్ సేవ కార్యక్రమం జరిగింది. రాత్రి చంద్రప్రభ వాహనం అలంకరణలో మంగళ వాయిద్యాలతో ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆళ్ల శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురు దేవస్థానం పురోహితులు పాల్గొన్నారు.