జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ కు ఫిర్యాదు చేశారు. వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళిధర్, కలెక్టర్ ఆనందం కలిసి సైదాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఖలీల్ అహ్మద్ పాల్గొన్నారు.