విప్ ఉల్లంఘించిన వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ల పై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కార్తీక్ కు మంగళవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ విప్ ఊటుకూరు నాగార్జునతో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.