అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2025-26 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ చివరి తేది ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 25 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నెల్లూరులో ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక అభ్యర్థి ఇప్పుడు అగ్నివీర్‌లో రెండు వేర్వేరు కేటగిరీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు.