బడిఈడు చిన్నారులందరిని బడికి పంపించి వారి బంగారు భవిష్యత్‌కు బాటాలు వేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె. ఉదయభాస్కర్‌రావు అన్నారు. ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం నగరంలోని గాంధీబొమ్మ నుంచి వీఆర్‌సీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిఆర్‌వో ఉదయభాస్కర్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఏడి గౌస్ బాషా, ఐసిడిఎస్ పిడి అనురాధ తదితరులు పాల్గొన్నారు.