నెల్లూరు: అమోనియా గ్యాస్ లీక్ కలకలం

60చూసినవారు
నెల్లూరు: అమోనియా గ్యాస్ లీక్ కలకలం
నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ కలకలం రేపింది. టీ పీ గూడూరు మండలం అనంతపురం గ్రామంలో వాటర్ బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో కార్మికులు పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం జరిగింది. ఈ ఘటనలో 10 మంది అస్వస్థత కాగా.. నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కలకు కూడా గ్యాస్ వ్యాపించింది.

సంబంధిత పోస్ట్