నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపల్ కె. శంకరయ్య బుధవారం ప్రకటనలో అర్హత కలిగిన విద్యార్థులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు, ఇతర విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. 37 సీట్లు అందుబాటులో ఉన్నాయి.