నెల్లూరు: బైక్ సామాన్లు తెచ్చుకోమన్నందుకు కత్తితో దాడి

51చూసినవారు
నెల్లూరు: బైక్ సామాన్లు తెచ్చుకోమన్నందుకు కత్తితో దాడి
నెల్లూరు మూలపేట రావి చెట్టు సెంటర్ వద్ద గురువారం సాయంత్రం వివాదం తలెత్తింది. ఓ బైక్ మెకానిక్, వాహనదారుడు మధ్య వాగ్వాదం జరిగింది. బైక్ కు సంబంధించి సామాన్లు తెచ్చుకోమని గట్టిగా చెప్పటంతో వాహనదారుడు చాకుతో దాడి చేశాడు. మెకానిక్ కు అడ్డుపోయిన అతని బంధువు చేతికి రెండుచోట్ల స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఒకటవ నగర ఎస్సై అయ్యప్ప సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు.

సంబంధిత పోస్ట్