నెల్లూరు బాలాజీ నగర్ లోని సీతారాముని రథోత్సవం ఆదివారం కన్నుల పండుగ సాగింది. రామాలయం నుంచి నగర వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. భారీ భక్తజన సందోహం మధ్య సాయి దర్బార్ భక్తుల కోలాటాల మధ్య, మిరిమిట్లు గొలిపే బాణసంచా ధ్వనులతో, మంగళ వాయిద్యాలతో బాలాజీ నగర్ ఏసీ నగర్ ప్రజలకు శ్రీరామచంద్రుడు సీతమ్మ తో కలిసి దర్శనమిచ్చారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాలు. విభిన్నమైన డ్రమ్స్ అందరినీ అలరించాయి.