వెలగపూడిలోని శాసనమండలిలో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు తన ఛాంబర్ లో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీదా రవిచంద్ర చేత బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఒకసారి ప్రమాణస్వీకారం కొన్ని కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.