నెల్లూరు: జులై 6 నుంచి రొట్టెల పండుగ

68చూసినవారు
నెల్లూరు: జులై 6 నుంచి రొట్టెల పండుగ
నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ సంవత్సరం జూలై 6 నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది. రాష్ట్ర పండుగగా ప్రాచుర్యం పొందిన ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. చదువు, ఆరోగ్యం, ఉద్యోగం, పెళ్లి, సంతానం వంటి 12 కోరికల నెరవేరేందుకు స్వర్ణాల చెరువులో రొట్టెలు వదులుతారు లేదా ఇతర భక్తులకు ఇస్తారు. కోరిక తీరితే వచ్చే ఏడాది మళ్లీ రొట్టెలు తీసుకొస్తారు.

సంబంధిత పోస్ట్