నెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్ద ఆదివారం రొట్టెల పండగ ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు బారా షాహిద్ లను దర్శించుకున్నారు. స్వర్ణాల చెరువులో కోర్కెలు తీర్చే విధంగా రొట్టెలు మార్పిడి చేసుకున్నారు. నెల్లూరు జిల్లాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.