నెల్లూరు నగరంలో విద్యుత్ సమస్యలకు సంబంధించి ఫ్యూజ్ ఆఫ్ కాల్ నెంబర్స్ కు ఫోన్ చేయాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయన్ పేర్కొన్నారు. అలాగే ప్రతి ట్రాన్స్ఫార్మర్ దిమ్మెపై సంబంధిత ఫ్యూజ్ ఆఫ్ కాల్ నెంబర్, సంబంధిత లైన్ మెన్ నెంబర్ పెద్ద అక్షరాలతో రాసే కార్యక్రమం ప్రారంభం చేశామన్నారు. జిల్లా అంతటా ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులకు 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలన్నారు.