నెల్లూరు: రుణం ఇప్పిస్తామని ఖాతాలో నగదు మాయం

55చూసినవారు
నెల్లూరు: రుణం ఇప్పిస్తామని ఖాతాలో నగదు మాయం
సీతారామపురం మండలానికి చెందిన కె. రాజుకు పొదలకూరు పద్మావతి నగర్ కు చెందిన శివకృష్ణారెడ్డి పరిచయమయ్యాడు. ఆయన బ్యాంకులో లోను ఇప్పిస్తానని రాజును నమ్మించాడు. అనంతరం అతనికి తెలియకుండానే ఓ బ్యాంకు ఖాతా నుంచి రూ. 5 లక్షలు, మరో ఖాతా నుంచి రూ. 4. 20లక్షలు మొత్తంగా రూ. 9. 20 లక్షలు శివకృష్ణారెడ్డి కాజేశాడు. దీనిపై బాధితులు నెల్లూరు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్