కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకొన్న సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. గురువారం నెల్లూరు గోమతీ నగర్ లోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జై జై నినాదాలతో హోరెత్తిన మంత్రి క్యాంపు కార్యాలయం మారుమోగింది. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కేక్ కట్ చేశారు.