నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 16మందికి మంజూరైన రూ. 14లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో వైద్యం పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమన్నారు.