నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఏసి సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం కల్పించి, ప్రాంగణం నిరంతరం శుభ్రంగా ఉండేలా పర్యవేక్షించాలని కమిషనర్ వై. ఓ నందన్ నిర్వాహకులకు సూచించారు. బుధవారం నెల్లూరు కూరగాయల మార్కెట్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ ప్రాంగణంలో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ పనులను తనిఖీ చేశారు. స్థానిక సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.