వైఎస్ఆర్సిపి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి యాక్టివిస్ట్ లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డిలు మంగళవారం నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టిడిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు సీమరాజా అలియాస్ చంద్రకాంత్ చౌదరి, యాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో కోరారు.