నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో టాక్స్ రివిజన్ సర్వేకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలని కమిషనర్ వై. ఓ నందన్ రెవెన్యూ అధికారులు, వార్డ్ అడ్మిన్ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం రెవెన్యూ సెక్షన్ వారాంతపు సమీక్షా సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, సూపరింటెండెంట్ నరేంద్ర, రెవెన్యూ అధికారులు శ్రీనివాసులు పాల్గొన్నారు.