నెల్లూరు: డిజిటల్ గ్రంథాలయంగా మార్చండి

81చూసినవారు
నెల్లూరు: డిజిటల్ గ్రంథాలయంగా మార్చండి
జాఘవా గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా మార్చాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను శనివారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో భారత సేవా ఫౌండేషన్ వారు కోరారు. ఈ మేరకు వారు వినతిపత్రం సమర్పించారు. ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ ఖాసీం మాట్లాడుతూ పీ-4 విధానంలో ఈ గ్రంథాలయంలో నిరుద్యోగ యువత కోసం కంప్యూటర్ సైన్సు కోర్సులు ప్రవేశపెట్టాలని కోరారు. జాఘవా గ్రంథాలయం వీధికి గుర్రం జాఘవా పేరు పెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్