నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీగా ఆయనను నియమించారు. నూతన కమిషనర్ గా ఇంకా ఎవరినీ నియమించలేదు. నెల్లూరు కమిషనర్ గా సూర్య తేజ బాధ్యతలు చేపట్టి ఏడాది గడపకు ముందే ఆయన బదిలీ అయ్యారు నెల్లూరు కార్పొరేషన్ లో అనేక నిర్ణయాలతో ఆయన వివాదాస్పదమైన వ్యక్తిగా నిలిచారు. దీంతో బదిలీ తప్పనిసరి అయింది.