వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అసమర్థత, నాయకత్వ లోపంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపొందిన అనేకమంది పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో విసిగెత్తిపోయి తాము ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరామన్నారు.