ముస్లిం సమాజానికి నష్టం కలిగే వక్ఫ్ బిల్ సవరణ చట్టానికి వ్యతిరేకిస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద శనివారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ లు మాట్లాడుతూ బిజెపి అధికారంలో వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం మైనార్టీలకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.