నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ నేడు ప్రారంభం అయింది. ప్రస్తుతం మొహర్రం వేడుకలు జరుగుతున్నాయి, ఇవి ఆదివారంతో ముగియనున్నాయి. దీంతో ఈరోజు భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి భక్తుల సంఖ్య ఎక్కువవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అక్కడ 1700 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.