అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని నవాబ్ పేట, వెంకటేశ్వరపురంలలోని పునరుద్దరించిన ఎఫ్ సి ఐ, అబ్దుల్ కలాం పార్కులను పునః ప్రారంభించారు. అలాగే అల్లిపురంలోని చెత్త తొలగింపు పనులను మంత్రి పరిశీలించారు.