పంచాయతీ పురోగతి సూచికపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నెల్లూరు జడ్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ హాజరై మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2030 నాటికి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు.