రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత అన్నారు. శుక్రవారం ఉదయం భారతీయ స్టేట్‌బ్యాంక్ 70వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా రెడ్‌క్రాస్ సౌజన్యంతో రంగనాయకులపేట భారతీయ స్టేట్‌బ్యాంకు రీజనల్ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుజాత హాజరై రక్తదాన ప్రాధాన్యతను వివరించారు.