అసోసియేషన్ అఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో నెల్లూరు డిస్ట్రిక్ట్ కమిటీ ఎన్నికలు శనివారం నెల్లూరు నందు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు అందరూ పాల్గొని తమ విలువైన ఓటు వేసి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు ఎఎస్ ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్వర్యంలో విజయవంతంగా జరిగాయి.