నెల్లూరు: మాజీ మంత్రి కాకాణికి 14 రోజుల రిమాండ్

82చూసినవారు
నెల్లూరు: మాజీ మంత్రి కాకాణికి 14 రోజుల రిమాండ్
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డికి న్యాయస్థానం మంగళవారం 14 రోజుల రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే నెల్లూరు జైలులో ఉన్న ఆయనను, గుంటూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు. అనంతరం సీఐడీ అధికారులు మళ్లీ ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. ముత్తుకూరు టోల్ గేట్ వ్యవహారంలో మరో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్