నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ గాంధీనగర్ రోడ్డును రెండు కోట్ల 70 లక్షల నిధులతో నిర్మిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన గాంధీ నగర్ రోడ్డును పరిశీలించి మాట్లాడుతూ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బొమ్మ వద్ద నుంచి డైకాస్ రోడ్ సెంటర్ వరకు సెంటర్ లైటింగ్, డివైడర్ ఏర్పాటు, ఫుట్ పాత్ ఏర్పాటు చేసి అత్యంత సుందరంగా నిర్మిస్తామన్నారు.