నెల్లూరు జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు రేణిగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డిని లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. సోమవారం పలు కార్యక్రమాలలో లోకేష్ నెల్లూరులో పాల్గొంటారు.