నెల్లూరు వెంగళరావు నగర్ లో విశ్రాంత రైల్వే ఉద్యో గులు వెంకటేశ్వర్లు, కొండమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. చిన్న కుమారుడు ప్రసన్నకుమార్ కు వివాహం నిశ్చయమైంది. ఆయన గత నెల 29న బీరువాలోని తన బంగారు బ్రాస్లెట్, రెండు గొలుసుల కోసం చూడగా అవి కనిపించలేదు. ఆభరణాల మాయంపై శనివారం వేదాయపాలెం పోలీ సులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పనిమానే సిన పని మనిషిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.