నెల్లూరు: ఎస్టీ వర్గీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

85చూసినవారు
నెల్లూరు: ఎస్టీ వర్గీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
రాష్ట్రంలో ఎస్టీల వర్గీకరణ కు ప్రభుత్వం చర్యలు చేపట్టి యానాదులకు న్యాయం చేయాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు పెంచలయ్య డిమాండ్ చేశారు. ఎస్టీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి టౌన్ హాల్ వరకూ సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కీలుగుర్రాల ఆటలు, తీన్మార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉద్యోగ నేత చేవూరు సుబ్బారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్