ఎస్సీ, ఎస్టీ, అక్రమ మైనింగ్, పేలుడు పదార్థాల నిషేధచట్టం కేసులో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. బెయిల్ కు సంబంధించి గురువారం విచారణ జరగాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సెలవులో ఉన్నారు. దీంతో శుక్రవారం జడ్జి బాధ్యతలు చేపట్టనుండటంతో విచారణ జరగనుంది.