నెల్లూరు: పేదల గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి

84చూసినవారు
నెల్లూరు: పేదల గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి
జిల్లాలో పేదల గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టర్ వారి చాంబర్లో ఎన్టీఆర్ హౌసింగ్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇళ్ల నిర్మాణ దశలను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్