మతసామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమైక్యత యాత్రలో ముగింపు సందర్భంగా సిపిఎం పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు వి ఆర్ సి గ్రౌండ్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీనియర్ నేత మాదాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.