నెల్లూరులో శనివారం ఓ భర్త భార్యను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో బాలాజీ నగర్ గౌడ్ హాస్టల్ సెంటర్ వద్ద లంక విజయచంద్ర తన భార్య శైలజను రోకలి బండతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న ఆరో పట్టణం పోలీసులు అక్కడకు చేరుకొని విజయచంద్రను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.