రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ గా హుస్సేన్ సాహెబ్ నియమితులయ్యారు. ఆయన గతంలో నెల్లూరు ఆర్డీవోగా పనిచేశారు. ఆర్డీవో గా ఆయన జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్నారు. బదిలీపై వెళ్లినప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ గా తిరిగి నెల్లూరు జిల్లాకు రానున్నారు.